Posts

Showing posts from June, 2025

బైబిల్ వివాహం గురించి ఏమి చెప్తుంది?

Image
వివాహము యొక్క ప్రారంభం ఆదికాండము 2:23- 24లో చెప్పబడింది: “అప్పుడు ఆదాము ఇట్లనెను, నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” దేవుడు ఆదామును చేసెను మరియు ఆయనను సంపూర్ణం చేయుటకు తదుపరి స్త్రీని చేసెను. బైబిల్ లో వివాహము అనేది దేవుడు “జతచేసింది” ఎందుకంటే “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు” (ఆదికాండము 2:18). బైబిల్ మొదటి వివాహమును వివరిస్తుండగా, హవ్వను సూచించడానికి ‘సహాయము’ అను పదం ఉపయోగించబడింది (ఆది. 2:20). ఈ సందర్భంలో, “సహాయం” చేయుట అంటే “ఆవరించుట, రక్షించుట లేదా చికిత్స చేయుట” అని అర్థం. దేవుడు హవ్వను చేసింది ఆదాముకు అతని “మరో సగభాగంగా” ఉండుటకు, ఆయనకు సహాయపడుటకు మరియు సహాయకురాలిగా ఉండుటకు.” పురుషుడు మరియు స్త్రీ “ఏక శరీరమగుటకు” వివాహం కారణమౌతుంది అని బైబిల్ చెప్తుంది. ఈ ఏకత్వం భౌతిక లైంగిక సంబంధంలో పూర్తిగా వ్యక్తపరచబడింది. ఈ ఏకత్వమును గూర్చి క్రొత్త నిబంధన గ్రంధం మరొక హెచ్చరికను చేర్చింది: కాబట్టి వారు ఇద్దరుకాకా ఏకశరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జత...